యువతకు స్వయం ఉపాధి అవకాశాలు
రాష్ట్రంలో యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు.
- డ్రగ్స్ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు
- యువజనోత్సవాల్లో ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ
జూబ్లీహిల్స్, జూలై 15: రాష్ట్రంలో యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారాభవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ ఆధ్వర్యంలో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.వాణీ ప్రసాద్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, మీర్జా రెహ్మత్ బేగ్ ఖాద్రీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ఆయన ప్రారంభించారు. సెట్విన్ ఆధ్వర్యంలో కొత్తగా ప్రవేశపెట్టనున్న కోర్సుల బ్రోచర్‌ను ఆవిష్కరించిన అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్న సెట్విన్ సంస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదన్నారు.
యువత డ్రగ్స్ బారినపడి పెడదోవ పట్టకుండా సెట్విన్ ద్వారా చేపట్టే శిక్షణతో పాటు మానసిక ఉల్లాసం పెంపొందించే క్రీడలు, సంస్కృతిని ప్రతిబింబించే అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. శాసనమండలి సభ్యురాలు సురభి వాణీదేవి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీ యువకులకు అధునాతన కోర్సులను ప్రవేశపెట్టి, శిక్షణ ఇచ్చేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. సెట్విన్ ఎండి కె.వేణుగోపాల్ రావు అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో పర్యావరణ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యూటీషియన్ విద్యార్థులతో బ్రైడ్స్ ఆఫ్ ఇండియా షోతో పాటు తెలంగాణ చేనేత వస్ర్తాలు, పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, గొల్లభామ చీరలతో ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థుల సంప్రదాయ ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివరాంరెడ్డి, తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జగన్మోహన్ రెడ్డి, జువ్వాడి శ్రీచరణ్, కోశాధికారి ఐలిరెడ్డి, సెట్విన్ అకౌంట్స్ ఆఫీసర్ సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

