నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం పట్టివేత
అక్రమంగా ఇతర రాష్ర్టాలకు చెందిన నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయిస్తున్న నిందితుడిని సికింద్రాబాద్ డీటీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు.
సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): అక్రమంగా ఇతర రాష్ర్టాలకు చెందిన నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయిస్తున్న నిందితుడిని సికింద్రాబాద్ డీటీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐ సావిత్రి సౌజన్య కథనం ప్రకారం… సికింద్రాబాద్‌లోని బగర బార్ అండ్ రెస్టారెంట్ పరిసర ప్రాంతాల్లో జోరుగా ఇతర రాష్ర్టాలకు చెందిన నాన్‌డ్యూటీ పెయిడ్, డిఫెన్స్ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు డీటీఎఫ్ బృందం స్థానికంగా రూట్‌వాచ్ నిర్వహించి, వాహనాలు తనిఖీ చేశారు.
సనత్‌నగర్‌కు చెందిన నిఫా ధార ప్రయాణిస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా హరియాణ, ఢిల్లీ, గోవా, వెస్ట్ బెంగాల్, కర్నాటక తదితర రాష్ర్టాలకు చెందిన మద్యం బాటిళ్లు లభించాయి. గత కొంత కాలంగా నిందితుడు ఇతర రాష్ర్టాల నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తూ సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నట్లు తేలింది. నిందితుడిని అరెస్టు చేసి, రూ.3లక్షల విలువ చేసే 85 ఎన్డీపీఎస్ మద్యం బాటిళ్లు,కారును స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ ఈఎస్ పంచాక్షరి పర్యవేక్షణలో ఈ దాడులు జరిగాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

