కార్వాన్, మార్చి 23: నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్న ఓ నిందితుడిని టప్పాచబుత్రా పోలీసులు అరెస్టు చేసి నిందితుడి నుంచి నకిలీ సరుకుతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాములు తెలిపిన వివరాల ప్రకా రం.. జిర్రా ప్రాంతానికి చెందిన సయ్యద్ అబ్దుల్ ఖాద్రి(28) బెంగళూరు నుంచి ఐటీసీ కంపెనీకి చెందిన దాదాపు రూ.16,80,000 విలువైన గోల్డ్ ఫ్లాగ్ నకిలీ సిగరెట్లను తీసుకువచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా..
విశ్వసనీయ సమాచారం మేరకు టప్పాచబుత్రా ఇన్స్పెక్టర్ రాములు నేతృత్వంలో పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ నకిలీ సరుకును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.