Sri Ganesh | హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకుడు శ్రీ గణేశ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలోని తన చాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ శ్రీ గణేశ్ చేత ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన శ్రీ గణేశ్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ నియోజకవర్గానికి మే నెలలో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో శ్రీ గణేశ్ 13 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ తరుపన నివేదిత, బీజేపీ నుంచి వంశ తిలక్ పోటీ చేశారు.