మల్కాజిగిరి: మెట్రో రైల్ రెండో దశను విస్తరించాలని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బేగంపేటలోని మెట్రో రైల్ కార్యాలయంలో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి ఎమ్మెల్యే గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మెట్రో రైల్ రెండో దశలో 105 కిలో మీటర్లు విస్తరించాలన్నారు. జేబీఎస్ నుంచి మేడ్చల్ 20 కిమీ, జేబీఎస్ నుంచి శామీర్‌పేట 22 కిమీ, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ 22 కిమీ, బోయిన్పల్లి నుంచి గండి మైసమ్మ 21 కిమీ, తార్నాక నుంచి కీసర 20 కిలోమీటర్ల కనెక్టివిటీని ఏర్పాటు చేయాలన్నారు. మెట్రో రైల్‌ను విస్తరించడం ద్వారా నగరం మొత్తం సమతుల్యంగా అభివృద్ధి చెందడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తప్పుతాయన్నారు. రెండో దశ విస్తర్ణం కోసం సర్వే నిర్వహించి ప్రజలకు మెట్రో రైల్ రవాణా సౌకర్యం కల్పించాలన్నారు.