
సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : మహానగరంలో ప్రయాణం సులభతరం చేయాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన నాల్గవ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 12అంశాలకు గాను 10 అంశాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్, స్టాండింగ్ కమిటీ సభ్యులు పన్నాల దేవేందర్ రెడ్డి, మహ్మద్ అబ్దుల్ సలాం షాహిద్, మహపర, మిర్జా ముస్తఫా బేగ్, మందగిరి స్వామి, బతా జాబిన్, విజయ్ కుమార్‌గౌడ్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, ప్రవీణ్ సుల్తానా, సీఎన్.రెడ్డి, మందడి శ్రీనివాస్ రావు, సామల హేమ, జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియా ఉద్దీన్, ప్రాజెక్ట్ సీఈ దేవానంద్, సీసీపీ దేవేందర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, కార్యదర్శి లక్ష్మి, ప్రాజెక్ట్ ఎస్ఈ రవీందర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీ.. ఆమోదించిన అంశాలు