జవహర్‌నగర్, జనవరి 3: మహిళలు, విద్యార్థినులు సావిత్రిబాయి ఫూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ సూచించారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో సావిత్రిబాయిఫూలే జయంతిని మేయర్ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో కమిషనర్ రామలింగం, కార్పొరేటర్లు, కోఆప్షన్‌సభ్యులు, మున్సిపల్ ఆర్ఓ ప్రభాకర్‌యాదవ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
కీసర: కీసర మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని సావిత్రిబాయి ఫూలే విగ్రహం వద్ద ఆమె జయంతి సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్యే కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, పీఆర్టీయు టీఎస్ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి కమాలాకర్‌రావు, పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి, ఎంపీడీవో రమాదేవి, ఎంపీపీ ఇందిరలక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు సత్తిరెడ్డి, జిల్లా పీఆర్టీయూ అధ్యక్షులు రామేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. శ్రీధర్, పీఆర్టీయూ ప్రతినిధులు పాల్గొన్నారు.
శామీర్‌పేట: సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మంగళవారం శామీర్‌పేటలో అమె చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో అఫ్జల్ఖాన్, వెంకట్‌రెడ్డి, శశికాంత్యాదవ్, నిస్సార్, మహేశ్, సురేశ్, గణేశ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
బోడుప్పల్: సావిత్రిఫూలేబాయి జయంతి సందర్భంగా మంగళవారం బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో వర్కల శివకిశోర్గౌడ్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసిన ఘనంగా నివాళులర్పించారు.
పీర్జాదిగూడ: పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు పంగ ప్రణయ్ కుమార్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యువ నాయకులు బండారి సాయి, వెంకట్, సురేశ్, మల్లేశ్, యాదగిరి, అర్జున్, సమ్మన్న పాల్గొన్నారు.