సిటీబ్యూరో, మార్చి 30 : నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం తొమ్మిదవ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 10 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు మహ్మద్ అబ్దుల్ సలామ్ షాహిద్, మహపర, మిర్జా ముస్తఫా బేగ్, ప్రవీణ్ సుల్తానా, మందగిరి స్వామి, బతా జబీన్, ఇ.విజయ్‌కుమార్ గౌడ్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, ఎం.శ్రీనివాస రావు, ప్రేమ్ కుమార్, సీఎన్.రెడ్డి, రావుల శేషగిరి, సామల హేమ, కమిషనర్ డీఎస్.లోకేశ్ కుమార్, ఏసీ ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్ కెనడి, జోనల్ కమిషనర్లు సామ్రాట్ అశోక్, శ్రీనివాస్ రెడ్డి, పంకజ, రవికిరణ్, మమత, ప్రియాంక అలా, సీసీపీ దేవేందర్ రెడ్డి, అడిషనల్ సీపీ శ్రీనివాస్, సీఈ దేవానంద్, అకౌంట్ చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, కార్యదర్శి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీలో.. ఆమోదించిన అంశాలు
సర్దార్ మహల్ పునరుద్ధరణకు చర్యలు
పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్ (పీపీపీ) ద్వారా సర్దార్ మహల్‌ను కల్చరల్ సెంటర్‌గా మార్చే ప్రతిపాదనలకు ఆమోదం. పాతబస్తీలోని సర్దార్ మహల్‌ను సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందులో కొనసాగుతున్న సర్కిల్ కార్యాలయాలను మరో చోటికి తరలించి సర్దార్ మహల్‌ను పునరుద్ధరించనున్నారు. దీన్ని కల్చరల్ సెంటర్‌గా మార్చనున్నారు. ప్రభుత్వ ఆదేశాల కోసం ప్రతిపాదనలు పంపారు.