మేడ్చల్, జనవరి29(నమస్తే తెలంగాణ) : మేడ్చల్ జిల్లా సనోఫీ మెడికల్ హెల్త్‌కేర్ ఇండియా వర్కర్స్, స్టాఫ్ యూనియన్ టీఆర్ఎస్కేవీ కార్మిక గుర్తింపు ఎన్నికల్లో అధ్యక్షుడిగా టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి శనివారం ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించిన కార్మికుల హక్కులు సాధనకు అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. సమస్యలు వస్తే మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి దృష్టికి తీసుకవెళ్తానన్నారు. తన గెలుపునకు సహకరించిన టీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకులకు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, ఐటీసీ, ఆర్ఈవీఎల్, పీపీఎల్ సంస్థ సహచర కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం కార్మిక ఓట్లు 482 ఉండగా మర్రి రాజశేఖర్‌రెడ్డికి 348 ఓట్లు రాగా 214 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.