కొండాపూర్, జనవరి 14: మాదాపూర్లోని శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబురాలలో భాగంగా శనివారం గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు, బుడబుక్కల, జంగమదేవరా గారడీ వేషాలతో చిన్నారులను ఆకట్టుకున్నారు. అనంతరం నటరాజ్ లాన్లో చిన్న పిల్లలకు భోగి పండుగను పురస్కరించుకుని భోగిపళ్ల ఉత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆంఫిథియేటర్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.