బేగంపేట, జూలై 7: పారిశుధ్య నిర్వహణలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకలకమైనదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు శానిటేషన్ కిట్లను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించగలరని అన్నారు. కార్మికులు పారిశుధ్య విధుల నిర్వహణతో పాటు తమ ఆరోగ్యం పట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా చెత్త, వ్యర్ధాలు రోడ్లపై వేయకుండా పారిశుధ్య నిర్వహణకు సహకరించాలని కోరారు.