సిటీబ్యూరో, ఏప్రిల్ 29,(నమస్తే తెలంగాణ): సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ్ మంగళవారం కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యా డు. సికింద్రాబాద్ కిమ్స్ వై ద్యులు ఆ బాలుడిని డిశ్చార్జ్ చేసి రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. గతేడాది డిసెంబర్ 4న పుష్ప-2 చిత్రం చూసేందుకు శ్రీతేజ్ తల్లిదండ్రులతోపాటు సంధ్య థియేటర్‌కు వెళ్లాడు.
అక్కడ జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందగా..ఆ బాలుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే..4నెలల 25 రోజులపాటు ఆసుత్రిలోనే ఉన్నాడు. బాలుడి డిశ్చార్జ్ విషయం గురించి కిమ్స్ పీఆర్ఓను సంప్రదించగా ఆయన తానకేమి తెలియదంటూ విషయాన్ని దాటవేయడం గమనార్హం.