సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిపై రయ్..రయ్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టాలెక్కిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఏడాది క్రితమే ప్రారంభం కావాల్సిన ఈ స్టీల్ బ్రిడ్జి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఇందులో భాగంగానే గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. ఆనంతరం చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) /మలక్‌పేట: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టాలెక్కిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఏడాది క్రితమే ప్రారంభం కావాల్సిన ఈ స్టీల్ బ్రిడ్జి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఇందులో భాగంగానే గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. ఆనంతరం చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. చంచల్‌గూడ జైలు కూడలి నుంచి సంతోష్‌నగర్ వరకు రూ.620 కోట్ల అంచనా వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవున 85 పిల్లర్లపై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది.
సంతోష్ నగర్, చంచల్ గూడ, సైదాబాద్ మీదుగా ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి లభించనున్నది. ప్రస్తుతం పీక్ అవర్స్‌లో అరగంట పడుతున్న ప్రయాణ సమయం, ఈ నల్గొండ స్టీల్ బ్రిడ్జి ఫె్లైఓవర్ అందుబాటులోకి రావడం ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే సులభంగా పూర్తి కానుందని అధికారులు తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సుదూర ఆలోచనతో, వ్యూహాత్మక ప్రణాళికతో రూపకల్పన చేసిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుండడం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

