సికింద్రాబాద్, మే13: ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సాయి వర్ధన్ (Sai Vardhan) తన సత్తాను చాటాడు. బీహార్ లో జరిగిన కేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి జూనియర్ విభాగంలో పాల్గొని బంగారు పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం సాయి వర్ధన్ ఔరంగాబాద్‌లో శిక్షణ పొందుతున్నాడు.
ఇప్పటికే పలుమార్లు వివిధ ప్రాంతాల్లో పతకాలు సాధించిన సాయివర్ధన్.. ఖేలో ఇండియా జాతీయ స్థాయిలో బంగారు పతకం పొందడం పట్ల పలువురు క్రిడా అభిమానులు అభినందించారు. ఈ సందర్భంగా సాయి వర్ధన్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మరెన్నో అంతర్జాతీయ పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకు రావడమే తన ద్యేయమని తెలిపారు. హైదరాబాద్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రెటరీ శ్రీనివాస్, కోచ్‌లు శ్రవణ్ కుమార్, శివ కుమార్, రాజు, హేమలత అభినందించారు.