కందుకూరు, డిసెంబర్ 21: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం కందుకూరు మండలం కొత్తగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2కోట్ల రూపాయలతో అదనపు తరగతి గదులు, ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. నూతన సంవత్సరంలో బొకేలు ఇవ్వకుండా నోట్ పుస్తకాలు, అందజేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని ఆమె సూచించారు. మహేశ్వరం నియోజకవర్గం సరస్వతి నిలయంగా మారిందని మంత్రి అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, వైఎస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, కొత్తగూడ సర్పంచ్ సాధ మల్లారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.