నేరేడ్మెట్: గౌతంనగర్ డివిజన్ ప్రజలకు, వాహనదారులకు దశాబ్ద కాలంగా నెలకొన్న రైల్వే గేటు అవస్థలు తీరనున్నాయని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి తెలిపారు. సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో గౌతంనగర్ గేటు వద్ద ఆర్యూబీ నిర్మాణానికి వివిధ శాఖల అధికారులతో మంగళవారం సన్నాహక సమావేశంలో జీహెచ్ఎంసీ, జలమండలి , విద్యుత్, వివిధ శాఖల అధికారులతో ఆర్యూబీపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు.
సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో గౌతంనగర్ ఆర్యూబీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమైనట్లు చెప్పారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని వాజ్పేయినగర్ ఆర్యూబీ నిర్మాణం అల్వాల్ , మచ్చబొల్లారం తదితర ప్రాంతాల్లో సుమారు 5 ఆర్యూబీలు నిర్మాణానికి చర్చలు జరిపామన్నారు. త్వరలో ఈ పనులను ప్రారంభించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. సమన్వయంతో పనిచేసి ఆర్యూబీ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలన్నారు. గౌతంనగర్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, రైల్వే అధికారులు, బీఆర్ఎస్ నేతలు మేకల రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.