RPSF Constable | మల్కాజిగిరి, ఆగస్టు 26: ప్రేమ విఫలమై ఆర్పీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం.. మౌలాలి ఆర్పీఎస్ఎఫ్లో వవన్‌కుమార్ 2015 నుంచి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం (23వ తేదీ) ఉదయం ఆరు గంటలకు బెటాలియన్ పీటీకి పవన్‌కుమార్ హాజరుకాలేదు.
అతడి కోసం అధికారులు గాలించారు. అడ్మినిస్ట్రేటివ్ భవనం వద్ద అతడిని విగత జీవిగా గుర్తించారు. మెడకు కేబుల్ వైర్‌తో ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. అతడి జేబులో లభించిన ఉత్తరంలో.. ‘ప్రేమ విఫలమై ఆత్యహత్య చేసుకున్నట్లు’.. గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.