రూ.2కే కుళ్లిన గుడ్ల విక్రయం
బొల్లారం డివిజన్ పరిధిలోని జ్యోతి థియేటర్ సమీపంలో శనివారం రాత్రి ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్రాలీ ఆటోలో వచ్చి గుడ్లను విక్రయించేందుకు ప్రయత్నించాడు. కేవలం రూ.2కే గుడ్డు విక్రయాలంటూ జనాలను ఆకర్షించాడు. ఇంత తకువ ధరకే గుడ్లు అమ్మడం చూసిన జనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు.
- కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిన జనం
- అంతలోనే బయటపడ్డ అసలు నిజం
బొల్లారం, ఏప్రిల్ 19: బొల్లారం డివిజన్ పరిధిలోని జ్యోతి థియేటర్ సమీపంలో శనివారం రాత్రి ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్రాలీ ఆటోలో వచ్చి గుడ్లను విక్రయించేందుకు ప్రయత్నించాడు. కేవలం రూ.2కే గుడ్డు విక్రయాలంటూ జనాలను ఆకర్షించాడు. ఇంత తకువ ధరకే గుడ్లు అమ్మడం చూసిన జనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. కొందరు కొనుగోలు కూడా చేశారు. కాగా తకువ ధరకే అమ్మకాలు జరపడం ఏంటని ఆలోచించిన జనాలు గుడ్డును పగలగొట్టారు.
దీంతో వింత వాసన, నల్లని పదార్థం కనిపించడంతో కొనుగోలుదారులు ఒకసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఫిర్యాదులు రావడంతో గుడ్ల అమ్మకందారుడు కొనుగోలు చేసిన కొంతమందికి తిరిగి డబ్బులు ఇచ్చేశాడు. కాగా గుడ్ల నాణ్యత, వాటిని ఎకడ నుంచి తీసుకొచ్చి విక్రయాలు జరిపారనే దానిపై విచారణలో తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

