
హయత్‌నగర్, సెప్టెంబర్ 1:పెద్ద అంబర్‌పేటలోని ఓఆర్ఆర్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ను వెనుక నుంచి వాహనం ఢీకొన్న ఘటనలో తిప్పర్తి మండలం తానేదార్పల్లి ఎంపీటీసీ కవిత(40), ఆమె భర్త వేణుగోపాల్‌రెడ్డి(52) మృతిచెందారు. హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ సురేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… దంపతులిద్దరూ స్కార్పియో వాహనంలో నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ముందుగా వెళ్తున్న టిప్పర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన వీరి వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో కవిత, వేణుగోపాల్‌రెడ్డి దంపతులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఇరుక్కుపోయిన దంపతుల మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.