ముషీరాబాద్ : సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సీ.ఎం మరణాన్ని కోరుతూ దిగజారి మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించి దహనం చేశారు.
బుధవారం ముషీరాబాద్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ యూత్ విభాగం నేత ముఠా జయసింహ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించి దహనం చేశారు. ఈ సందర్భంగా జయసింహ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సీఎం పట్ల కనీస మర్యాద లేకుండా దిగజారి మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటన్నారు.
రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దీన్‌దయాల్‌రెడ్డి, శివముదిరాజ్, మాధవ్, షరీపుద్దిన్, రాకేష్‌కుమార్, వై.శ్రీనివాస్, బింగి నవీన్‌కుమార్, శ్రీకాంత్, కల్వ గోపి, గిరి తదితరులు పాల్గొన్నారు.