సిటీబ్యూరో, ఆగస్టు31 (నమస్తే తెలంగాణ) : ట్రై కార్పొరేషన్ల(జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ)కు సంబంధించిన కొత్త లోగోలను సోమవారం మూసారంబాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా ఆవిష్కరించారు. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇటీవల జీహెచ్ఎంసీ నుంచి రెండు కొత్త కార్పొరేషన్లను వేరు చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)లకు సంబంధించి అధికారిక సమాచార వ్యవస్థలు, కార్యక్రమాలు, ప్రజా అవగాహన కార్యక్రమాల్లో ఈ కొత్త లోగో కార్పొరేషన్‌కు గుర్తింపుగా ఉంటుంది. ఈ కొత్త గుర్తింపు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే కార్పొరేషన్ నిబద్దతను ప్రతిభింబిస్తుందని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.