జీరో అవర్.. డబ్బులు సేఫ్!
ఇటీవల సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వివిధ రకాలుగా దోచుకుంటున్నారు. అయితే బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి..
- సైబర్ మోసాల్లో వేగంగా స్పందించాలి
- వెంటనే 1930కు కాల్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి
- దోచుకున్న సొమ్ము వెనక్కి రప్పించేందుకు అవకాశం
- పౌరులకు సైబర్ పోలీసుల సూచనలు
- ఐదు ఘటనల్లో రూ. 46 లక్షలు వాపస్ బాధితులకు అందజేత
సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఇటీవల సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వివిధ రకాలుగా దోచుకుంటున్నారు. అయితే బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి.. వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్, 1930, సైబర్‌క్రైమ్ ఠాణాకు జీరో అవర్‌లో ఫిర్యాదు చేస్తే పోయిన సొమ్మును వెనక్కి రప్పించేందుకు ఎక్కువ అవకాశాలుంటాయని సైబర్‌క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్ సైబర్‌క్రైమ్ ఠాణా ఆధ్వర్యంలో జీరో అవర్‌లో ఫిర్యాదు చేసిన పలువురికి పోయిన సొత్తును వెనక్కి రప్పించి బాధితులకు అప్పగించినట్లు డీసీపీ కవిత వెల్లడించారు. ఐదు ఘటనల్లో రూ. 55,32,900 సైబర్‌నేరగాళ్లు దోచుకోగా, జీరో అవర్‌లో ఫిర్యాదు చేయడంతో రూ. 46,07,085 లక్షల నగదు వెనక్కి రప్పించి, బాధితులకు అందించినట్లు చెప్పారు.
ప్రధానమైన కేసుల వివరాలివి..
- అంబర్‌పేటకు చెందిన బాధితుడికి గత నెల 27న ‘మేము ఫెడెక్స్ కొరియర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఆధార్ నంబర్‌పై ముంబై నుంచి ఇరాన్‌కు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి’ అంటూ ఆగంతకులు ఫోన్ చేశారు. ఇంతలో తాము ముంబై సైబర్‌క్రైమ్ పోలీసులం మాట్లాడుతున్నామంటూ.. స్కైప్‌లో కాల్ చేసి.. డిజిటల్ అరెస్ట్ చేశారు. మీ పేరుతో స్మగ్లింగ్ జరుగుతున్నది. ఆర్బీఐ, సీబీఐ విభాగాలు నీపై విచారణ చేస్తున్నాయం’టూ.. బ్యాంకు ఖాతాలు తీసుకొని రూ. 19,92,921 లక్షలు ప్రీ అప్రూవుడ్ లోన్ తీసుకున్నారు. ఆ తర్వాత బెదిరించి అందులో నుంచి రూ. 18 లక్షలు కాజేశారు. అయితే బాధితుడు వెంటనే హైదరాబాద్ సైబర్‌క్రైమ్ ఠాణాను సంప్రదించడంతో ఎన్సీఆర్పీ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయించి.. వెంటనే రూ. 18 లక్షలు ఆయా ఖాతాల్లో నిలిపివేయించి.. ఆ అకౌంట్లను ఫ్రీజ్ చేయించారు. కోర్టు అనుమతితో అందులోంచి డబ్బు వెనక్కి రప్పించి బాధితుడికి అప్పగించారు.
- ఇటీవల ఓ బాధితుడికి కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్ పంపించిన సైబర్‌నేరగాళ్లు..అతడి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నుంచి రూ. 2 లక్షలు కాజేశారు. బాధితుడు వెంటనే సైబర్‌క్రైమ్ ఠాణాను ఆశ్రయించడంతో ఎన్సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయించారు. ఆయా ఖాతాలను బ్లాక్ చేసి.. రూ. 1,75,185 వెనక్కి రప్పించారు.
- ముంబై పోలీసులమంటూ ఫోన్ చేసి.. ‘మీ పేరుతో స్మగ్లింగ్ జరుగుతున్నదని బెదిరించి.. రూ. 5.90 లక్షలు కాజేశారు. బాధితుడు సైబర్‌క్రైమ్ ఠాణాను ఆశ్రయించడంతో సిబ్బంది వెంటనే ఎన్సీఆర్పీ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయించి బాధితుడి డబ్బు వెళ్లిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి.. అందులో నుంచి రూ. 4,73,000 లక్షలు వెనక్కి రప్పించారు.
- రూ. 20.08,900 పోగొట్టుకున్న ఓ వ్యక్తి వెంటనే సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ డబ్బులను వాపస్ తెప్పించి బాధితుడికి అందజేశారు.
- మరో బాధితుడు రూ. 9.40 లక్షలు పోగొట్టుకొని.. ఫిర్యాదు చేయడంతో సైబర్‌నేరగాళ్ల బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. రూ. 1.5 లక్షలు వెనక్కి రప్పించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

