Kondapur | డివైడర్ ఏర్పాటుతో ఇరుకుగా మారిన రోడ్డు.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన
రహదారిపై ట్రాఫిక్ సమస్యలను తగ్గించాల్సిన డివైడర్ నిర్మాణం.. వాహనదారులకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది.
కొండాపూర్, అక్టోబర్ 11: రహదారిపై ట్రాఫిక్ సమస్యలను తగ్గించాల్సిన డివైడర్ నిర్మాణం.. వాహనదారులకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. మియాపూర్ సర్కిల్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీలో డివైడర్ ఏర్పాటుతో రోడ్డు ఇరుకవ్వగా… నిలిచిన పనులతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు ఫుట్పాతక్కు ఆనుకుని ఉన్న కమర్షియల్ దుకాణాల ఎదుట సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో రోడ్డుపైనే వాహనాలను అడ్డదిడ్డంగా నిలిపేస్తుండటంతో సమస్య మరింత జటిలమవుతోంది. డివైడర్ నిర్మాణ పనులు నెల రోజులుగా నిలిచిపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన ఐరన్ రాడ్లు ప్రమాదకరంగా ఉండడం, ఏ కొద్దిపాటి యేమరపాటయిన ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రమాదకరంగా మారిన ఇనుప రాడ్లు..
డివైడర్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ రాడ్లు ప్రమాదకరంగా మారాయి. పనులు నిలిచిపోవడంతో రోడ్డుపై ఇనుప రాడ్లు అలాగే ఉండిపోయాయి. రాడ్లు కనిపించకుండా ఉండేలా గ్రీన్ కవర్లను కప్పి ఉంచారు. గత రాత్రి ఓ కారు అదుపుతప్పి ఆ రాడ్లలోకి దూసుకెళ్లడంతో తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో వాహనదారులు, స్థానికుల్లో ఆందోళన నెలకొంది. రాత్రి వేళల్లో రాడ్లు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు.
పార్కింగ్తో మరింత ఇక్కట్లు..
గతంలో రోడ్డు నిర్మాణ సమయంలోనే ఇరువైపులా ఫుట్‌పాత్‌లను నిర్మించడంతో రోడ్డు వెడల్పు తగ్గింది. మరోసారి డివైడర్ కారణంగా రహదారి మరింత ఇరుకుగా మారగా దుకాణాల ఎదుట వాహనాలను నిలిపివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాహనాల పార్కింగ్ కారణంగా వన్‌వేలో కేవలం ఒక వాహనం మాత్రమే పోయేంత రోడ్డు ఇరుకుగా మారింది. రద్దీ సమయాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు మరింత జఠిలమవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డివైడర్ పరిమాణం తగ్గించాలి..
అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి డివైడర్ పరిమాణాన్నితగ్గించాలని కాలనీవాసులు కోరుతున్నారు. నిలిచిపోయిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే దుకాణాల ఎదుట ఆక్రమ పార్కింగ్‌ను నియంత్రించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని దీప్తిశ్రీనగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

