సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మద్యం షాపులను ఎంపిక చేస్తూ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నిర్ణయం తీసుకున్నారు. మద్యం షాపులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. మద్యం షాపుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడ సామాజిక వర్గానికి 15 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అందుకనుగుణంగానే జిల్లాలో ఎస్టీలకు 1, ఎస్సీలకు 4, గౌడ కులస్తులకు 5 షాపులను ఎంపిక చేయగా.. సికింద్రాబాద్ పరిధిలో ఎస్టీలకు 1, ఎస్సీలకు 7, గౌడలకు 6 దుకాణాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్సై జ్ సూపరింటెండెంట్లు విజయ్, పవన్‌కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి యాద య్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖాధికారి ఆశ న్న, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి సంధ్య తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్- మల్కాజిగిరిలో..
Hyd7
మేడ్చల్, ఆగస్టు3 (నమస్తే తెలంగాణ): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో మద్యం దుకాణాలను రిజర్వేషన్ల ప్రకారం కేటాయించారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో 2023- 25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ, రిజర్వేషన్ల మేరకు ఆబ్కారి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ లక్కీ డ్రా నిర్వహించి దుకాణాలను కేటాయించారు. జిల్లాలోని మేడ్చల్ ఎక్సైజ్ పరిధిలో 114 మద్యం దుకాణాలు ఉండగా.. గౌడ కులస్తులకు 11 (15 శాతం), ఎస్సీలకు 5 (10 శాతం), ఎస్టీలకు 1 (5 శాతం) దుకాణాలు కేటాయించగా.. మల్కాజిగిరి ఎక్సైజ్ పరిధిలో 88 దుకాణాలకు గానూ గౌడ కులస్తులకు 12, ఎస్సీలకు 7, ఎస్టీలకు 1 దుకాణం కేటాయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్‌రెడ్డి, అభిషేక్ ఆగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు అరుణ్‌కుమార్, విజయభాస్కర్, జిల్లా అధికారులు వినోద్‌కుమార్, కేశురామ్, ఆర్డీవోలు రాజేశ్‌కుమార్, శ్యాంప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.