వనస్థలిపురం : ఎన్జీవోస్ కాలనీలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం 20వ వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హోమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్మాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. 20 ఏళ్లుగా దేవస్థాన అభివృద్ధికి పనిచేస్తున్న కమిటీని అభినందించారు. బీఎన్‌రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూదన్‌రెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మారెడ్డిలు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో దేవస్థాన కమిటీ అధ్యక్షుడు మాలే రామ్‌రెడ్డి, కాటం క్రాంతి గౌడ్, చిట్టిప్రోలు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.