కాండూట్పై సిమెంట్ టైల్స్ తొలిగింపు
గండిపేట కాండూట్పై అక్రమ వ్యాపార కేంద్రాలు, నిర్మాణాలకు ఏర్పాటు చేసుకున్న అక్రమ రహదారులపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘కుచించుకుపోతున్న గండిపేట కాండూట్' అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై జలమండలి ఉన్నతాధికారులు స్పందించారు.
మణికొండ, జూన్ 28: గండిపేట కాండూట్పై అక్రమ వ్యాపార కేంద్రాలు, నిర్మాణాలకు ఏర్పాటు చేసుకున్న అక్రమ రహదారులపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘కుచించుకుపోతున్న గండిపేట కాండూట్’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై జలమండలి ఉన్నతాధికారులు స్పందించారు. గండిపేట డీజీఎం నరహరి నేతృత్వంతో పుప్పాలగూడ సమీపంలో ఓ నిర్మాణ సంస్థ అక్రమంగా నిర్మించిన రహదారిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అయితే, ముందుగా రహదారిపై వేసిన టైల్స్‌ను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా.. సదరు నిర్మాణదారులు తామే స్వయంగా తొలగిస్తామని చెప్పారని, రెండు రోజుల్లో తొలగించని పక్షంలో తామే స్వయంగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని డీజీఎం నరహరి తెలిపారు.
సదరు నిర్మాణ రంగ సంస్థ మొండిగా వ్యవహరిస్తున్నదని, తాము గతంలోనూ కాండూట్పై రాకపోకలకు అనుమతులు ఉండవని నోటీసులు జారీ చేశామని గుర్తు చేశారు. వితండవాదంగా వ్యవహరిస్తూ రాత్రిపూట నిర్మించారని పేర్కొన్నారు. నిర్ధేశించిన సమయంలోపు కాండూట్పై రహదారులను నిలిపివేయకుంటే తామే స్వయంగా రంగంలోకి దిగి తొలగిస్తామన్నారు. అదేవిధంగా.. కాండూట్పై వెలిసిన వ్యాపార కేంద్రాలను సైతం తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నమస్తే తెలంగాణ కథనంపై మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి విశేష స్పందన రావడం విశేషం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

