రేవంత్ సర్కార్‌కు రైతుల ఉసురు తగుల్తది
సాగునీరు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్‌కు రైతుల ఉసురు తగుల్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు.
- కేసీఆర్ సార్‌కు పేరొస్తుందనే కాళేశ్వరం నీటిని ఎత్తిపోస్తలేదు
- మహబూబాద్ జిల్లా తొర్రూరును కరువు మండలంగా ప్రకటించాలి
- మాజీ మంత్రి ఎర్రబెల్లి డిమాండ్
తొర్రూరు/పాలకుర్తి, నవంబర్ 11: సాగునీరు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్‌కు రైతుల ఉసురు తగుల్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఖానాపురంలో ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులు బచ్చలి సరోజన, ఈదునూరి రవీందర్, సోమన్న తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోవడంతో పెట్టుబడి సైతం తిరిగి వచ్చే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రైతులకు పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం అందించడంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని కాళేశ్వరం నుంచి ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే రాజకీయ కక్షతో నీటిని ఎత్తిపోయడం లేదని మండిపడ్డారు. ఎండిపోయిన పంటలకు తక్షణమే నష్టపరిహారం అందించడంతోపాటు తొర్రూరు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్లో భారీగా చేరికలు…
జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు బుధవారం బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

