చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యమివ్వాలి
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో మార్చి వరకు క్షామ పరిస్థితులు కొనసాగుతాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
- రైతులకు శాస్త్రవేత్తల సూచన
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో మార్చి వరకు క్షామ పరిస్థితులు కొనసాగుతాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. చలికాలం, వేసవిలో కరువును ఎదుర్కొనేందుకు రైతులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యమివ్వాలని మిల్లెట్ రీసెర్చ్ ల్యాబ్ వ్యవస్థాపకులు డాక్టర్ ముత్తమిలరసన్ సూచించారు. 100 రోజుల్లో చేతికొచ్చే జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగుల్లాంటి పంటలను సాగుచేయడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చని తెలిపారు.
పప్పుధాన్యాలు, నూనెగింజలతో పంటల సాగు వైవిధ్యాన్ని పెంచడం ద్వారా ఒకే పంట పై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని పేర్కొన్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న నల్లగొండ, నారాయణపేట, జోగుళాం బ గద్వాల జిల్లాల్లోని ఎంపిక చేసిన మండలాల రైతులకు కరువుపై అవగాహన కల్పించాలని, కరువును తట్టుకునే కొర్రలు, సజ్జలు, జొన్నలను సాగు చేయించాలని వ్యవసాయ అధికారులకు స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావాలతోపాటు వచ్చే ఏడాది సాగుచేయబోయే చిరుధాన్యలపై ఢిల్లీలోని నేషనల్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో కలిసి సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

