మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పలు డివిజన్లకు చెందిన 31 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ. 13.84 లక్షల ఆర్థిక సాయానికి చెందిన చెక్కులను కార్పొరేటర్ వెంకటేశ్‌తో కలిసి విప్ గాంధీ తన నివాసంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ పేద ప్రజలకు కొండంత భరోసాగా సీఎం సహాయ నిధి పథకం నిలుస్తుందన్నారు. అర్థిక స్తోమత లేక అనారోగ్యాల పాలవుతున్న పేదలు కార్పొరేట్ వైద్యం ద్వారా స్వస్థత పొందేందుకు ఈ పథకం తన నిరంతర సేవలను అందిస్తున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో మోహన్ గౌడ్, పార్టీ నేతలు సంజీవరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్,సాంబశివరావు, సైదేశ్వర్రావు, ధనలక్ష్మీ,శివరాజ్, ఇబ్రహీం, చంద్రమౌళి,సాగర్, గురుచరణ్, ఆంజనేయులు, వెంకట్, బసవయ్య, నర్సింలు, అష్రఫ్, ఖదీర్, యాసిన్, అంజలి పాల్గొన్నారు.