సిటీబ్యూరో, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ) : దసరా రోజున ఏ కార్యం చేపట్టినా.. దిగ్విజయంగా పూర్తవుతుందనే సెంటిమెంట్‌కు కాంగ్రెస్ సర్కార్ బ్రేక్ చేసింది. పండుగ రోజున సొంతింట్లో అడుగు పెట్టేవారు, డ్రీమ్ హోంకు భూమి పూజ చేసుకునేవారు, చివరకు కొత్తగా స్లాబ్ పనులు చేసే వారు కూడా దసరా పండుగ రోజున చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. కానీ గడిచిన రెండేండ్ల నుంచి నగరంలో ఆ సందడి లేకుండా పోయింది. దీంతో ఏటా దసరా సందడి రియల్ ఎస్టేట్ రంగంలో కనిపించకుండా పోయింది. రెండు నెలల ముందు . రియల్టీలో కనిపించని దసరా సందడి నుంచే రియల్ ఎస్టేట్ లావాదేవీలన్నీ పడిపోగా, కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు భూమి పూజ లేకుండా చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపలేదు.
నగరంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే రియల్ ఎస్టేట్ రంగాన్ని సంక్షోభాన్ని నెట్టివేసింది. చెరువులు, కుంటల సంరక్షణ పేరిట ఆక్రమణలను తొలగిస్తున్నామని చెప్పి… పేదల ఇండ్లను కూల్చివేయడంతో నగరంలో రియల్ రంగాన్ని ఆందోళన మొదలైంది. ఇక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణ అనుమతుల్లో సాగుతున్న అక్రమ కార్యాకలాపాలతో వ్యాపారులే భయపడిపోతున్నారు. దీంతో కట్టిన ఇండ్లను అమ్ముకోలేక, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోలేక వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది.
దసరా వచ్చిందంటే నగరం చుట్టూరా వెంచర్లు శంకుస్థాపనలు, భూమి పూజలతో కళకళలాడేవి. కానీ హైడ్రా కూల్చివేతల నుంచి ఇంకా కోలుకోలేని జనాలను చూసి బిల్డర్లు, డెవలపర్లుకొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లేందుకు జంకుతున్నారు. ఒకప్పుడు దసరా వచ్చిందంటే నగరంలో నిర్మాణం పూర్తైన ప్రాజెక్టులను కొనుగోలుదారుల చేతికిచ్చేవి 15వేలకు పైగా ఉండేవి. ఇక కొత్త రిజిస్ట్రేషన్లు కూడా 10వేలకు పైగా జరిగేవి. కానీ ఈ గణాంకాలు అన్ని కనుమరుగైపోయాయి.
దసరా నాటికి నగరంలో వ్యాపారం గాడిలో పడుతుందని భావించారు. వ్యాపారులు కూడా అదే అంచనా వేశారు. దానికి తగినట్లుగానే తెలంగాణ సర్కారు ఫోర్త్ సిటీ పేరిట హడావుడి చేసింది. కానీ క్షేత్రస్థాయిలో కొనుగోలుదారుల్లో కొరవడిన విశ్వాసం, మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా హైడ్రా విధానాలతో ఇటీవల హెచ్ఎండీఏ నిర్వహించిన వేలానికి కూడా స్పందన లేకుండాపోయింది. కాంగ్రెస్ విధానాలతో ముఖ్యంగా బడా వ్యాపారుల కంటే చిన్న వ్యాపారులను కోలుకోలేని దెబ్బ కొట్టాయి.