వీలైనంత త్వరగా సినిమా చేసేయడం..ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేసుకోవడం స్టార్ హీరో ఎన్టీఆర్‌కు అలవాటు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బిగ్ ప్రాజెక్ట్ తర్వాత ఆలస్యం చేయకుండా దర్శకుడు కొరటాల శివతో సినిమా మొదలుపెట్టారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. కొద్ది రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకు ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ముహూర్తం త్వరగానే పెట్టుకున్నా రెగ్యులర్ చిత్రీకరణ ఎప్పటినుంచో మూవీ టీమ్ నిర్ణయించుకోవడం లేదు. దీంతో ఈ సినిమా కొత్త సంగతి ఎప్పుడు చెబుతారా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం మేరకు మరో వారంలో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రానుందట. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఎన్టీఆర్ సరసన రష్మిక మందన్న నాయికగా ఎంపికైనట్లు తెలుస్తున్నది.