సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ‘ఆనందరావు అడ్వెంచర్స్’. ఈ చిత్రాన్ని జ్యాపీ స్టూడియోస్ పతాకంపై ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, సురేష్ కోతింటి నిర్మిస్తున్నారు. సుహాసినీ రాహుల్, మురళీ జంపన సహ నిర్మాతలు. ఫాంటసీ కథతో నూతన దర్శకుడు రామ్ పసుపులేటి రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. రానా, ఆనంద్ దేవరకొండ, దర్శకులు క్రిష్, నందిని రెడ్డి, బీవీఎస్ రవి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ..‘దర్శకుడు నాకు చాలాకాలంగా పరిచయం. అతను నాకు చెప్పిన ఏడవ కథ ఇది. మా కాంబినేషన్ తెరపైకి వస్తుండటం సంతోషంగా ఉంది’ అన్నారు. దర్శకుడు రామ్ పసుపులేటి మాట్లాడుతూ..‘మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు థ్యాంక్స్. చిల్డ్రన్ ఫాంటసీ కథతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రాకేష్ ఎస్ నారాయణ్, సంగీతం : మిక్కీ జే మేయర్.