సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ (సీసీపీ) ఎస్ దేవేందర్ రెడ్డి బదిలీ అయ్యారు. పురపాలక శాఖ పరిధిలోని టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించిన బదిలీలు జరిగాయి. ఈ మేరకు సోమవారం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సుధీర్ఘ కాలం పాటు జీహెచ్ఎంసీ సీసీపీగా బాధ్యతలు చేపట్టి టౌన్‌ప్లానింగ్ విభాగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చిన ఆయన తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. దేవేందర్‌రెడ్డిని డీటీసీపీ డైరెక్టర్‌గా నియమించారు. అక్కడ పనిచేసిన కె.విద్యాధర్‌ను హెచ్ఎండీఏ డైరెక్టర్ ప్లానింగ్-1కు బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ సీసీపీగా రాజేంద్రప్రసాద్ నాయక్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ స్థానంలో కొనసాగిన బాలకృష్ణను హెచ్ఎంఆర్ఎల్, రెరా మెంబర్ సెక్రటరీగా నియమించారు. హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ -2గా ఉన్న శివశరణప్పను ఎంఏయూడీ డైరెక్టర్‌కు బదిలీ చేశారు. జీహెచ్ఎంసీలో డైరెక్టర్‌గా కొనసాగిన కె. శ్రీనివాస్‌ను హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్-2గా నియమించారు. అడిషనల్ డైరెక్టర్‌గా ఇటీవల పదోన్నతి పొందిన బి.ప్రదీప్‌కుమార్, కె. గంగాధర్‌లను జీహెచ్ఎంసీలో అడిషనల్ చీఫ్ సిటీ ప్లానర్స్‌గా నియమించారు. వీరికి జీహెచ్ఎంసీలో ఏ ఏ బాధ్యతలు అప్పగిస్తారన్నది తెలియాల్సి ఉంది.