హైదరాబాద్ : హైదరాబాద్ నగరమంతా చల్లబడింది. ఆకాశం మేఘావృతమైంది. హైదరాబాద్కు ఉత్తరం, పడమర వైపు మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. అయితే మరో గంటలో హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అయితే చేవెళ్ల ప్రాంతంలో కమ్ముకున్న మేఘాలు రాజధాని వైపు దూసుకొస్తున్నాయని, దీంతో హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం నుంచి ఎండ లేనప్పటికీ.. ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే.
#HyderabadRains UPDATE 🚨
04:20PMDense Clouds have been formed around #Chevella. As per Current Wind Steering these Clouds are Moving towards the City.
Hence Moderate Rains🌧with T-Storms⚡ expected at isolated parts of City in next 90min@HiHyderabad @DonitaJose @serish pic.twitter.com/7Voo6QDPAh
— HYDERABAD Weatherman (@HYDmeterologist) April 15, 2022