హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఖైరతాబాద్, అమీర్‌పేట, సోమాజిగూడ, సికింద్రాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి ఉక్కపోతకు గురైన నగర ప్రజలు.. వానతో కాస్త ఉపశమనం పొందారు. భారీ వర్షానికి పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అక్కడక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.