సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ) : రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.
రాత్రి 9 గంటల వరకు గ్రేటర్లోని శివరాంపల్లిలో 1.8 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్లో 1.2, ఆసిఫ్నగర్లో 1.1, నాంపల్లిలో 1.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల రెండ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.