Hyderabad Rain | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. మధ్యాహ్నం దాకా ఎండ వేడిమితో అల్లాడిన నగరం.. సాయంత్రం ఒక్కసారిగా చల్లబడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, అమీర్‌పేట, ఖైరతాబాద్‌లో వర్షం కురుస్తున్నది. రానున్న 2 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జగిత్యాల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) August 27, 2023
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 28వ తేదీ వరకు హైదరాబాద్‌తో పాటు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటివకే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 2 మధ్య విరామం అనంతరం సెప్టెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్‌మ్యాన్ వివరించింది.