సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఏర్పడి ఉన్న ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అధికారులు నగరానికి ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు.