హైదరాబాద్ : నగరంలో మంగళవారం రాత్రి పలు చోట్ల వర్షం కురిసింది. కూకట్పల్లి, హైదర్‌నగర్, అల్విన్‌కాలనీ, మియాపూర్, చందానగర్, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, జీడిమెట్ల, షాపూర్‌నగర్, సూరారం, సికింద్రాబాద్, తిరుమలగిరి, బోయినపల్లి, అల్వాల్, మారేడుపల్లి, బేగంపేట, ప్యారడైజ్ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా.. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్ల వాన కురుస్తుందని హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.