సిటీబ్యూరో: రెండు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. బహుదూర్‌పురా ప్రాంతంలో అత్యధికంగా 8.65 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ఆవర్తనం ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్ పరిధిలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.