Rain Alert | హైదరాబాద్లో ఆదివారం సాయంత్రం పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో పలుచోట్ల వర్షం కురిసింది. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, లింగంపల్లి, తెల్లాపూర్, నిజాంపేట, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, గాజులరామారం, కూకట్పల్లి, చింతల్, బాలానగర్, మాదాపూర్, కొండాపూర్, కొంపల్లి, అల్వాల్, బొల్లారం, యాప్రాల్, నేరెడ్మెట్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
వానతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో ఉక్కపోతతో ఇబ్బందులుపడ్డ జనం వర్షం కురవడంతో కాస్త ఉపశమనం కలిగినట్లయ్యింది. హైదరాబాద్ నగరంతో పాటు నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది.
View in Gachibowli pic.twitter.com/3Ume7WqYOL
— Suman Amarnath (@sumanva) June 4, 2023