సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ఐకియా ఎదురుగా మరో భారీ మాల్, మల్టీఫ్లెక్స్ నిర్మాణానికి రహేజా మైండ్ స్పేస్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టు కోసం అప్పటి ప్రభుత్వం 15 ఎకరాలను ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థకు కేటాయించింది.
ఈ స్థలాన్ని ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ సబ్ లీజు కింద కె.రహేజా కార్పొరేషన్, బ్రూక్‌ఫీల్డ్ సంస్థలకు గతేడాది అప్పగించింది. దీంతో ఆ స్థలంలో మాల్, మల్టీఫ్లెక్స్‌తో పాటు ఆఫీసు స్పేస్‌ను నిర్మించేందుకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే సెల్లార్ పనులు చేస్తున్నారు. భారీ బహుళ అంతస్తులతో పాటు 14 సినిమా స్క్రీన్లతో నిర్మించనున్నారు. ఇందుకు రూ.1232 కోట్లను వెచ్చించనున్నాయి.