TGPSC | సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంట్లో ఉద్యోగాల ఎంపిక కోసం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈనెల 3, 4వ తేదీల్లో సీడీపీవో ఉద్యోగాల కోసం సీబీఆర్టీ పరీక్ష, అలాగే 6, 7వ తేదీల్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) గ్రేడ్-1 కోసం పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్ఎస్ 163(సీఆర్పీసీ 144) అమలులో ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షలు జరిగే తేదీల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని సీపీ సుధీర్‌బాబు తెలిపారు.
సైబరాబాద్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద 4రోజుల పాటు బీఎన్ఎస్ఎస్163(144)సెక్షన్‌ను విధిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి వెల్లడించారు. ఈనెల 3,4, 6, 7తేదీల్లో ఉదయం కమిషనరేట్ పరిధిలోని పరీక్షా కేంద్రాల చుట్టూ 200మీటర్ల దూరం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ ఐదుమంది లేదా అంతకు మించి గుమ్మిగూడటం, సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం వంటివి నిషేధమని తెలిపారు.