సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): గణేశ్ నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావారణంలో పూర్తి చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సూచించారు. సోమవారం నేరెడ్‌మెట్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులు, మండపాల నిర్వాహకులు, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ఈ నెల 27న గణేశ్ చవితి.. సెప్టెంబర్ 5 న మిలాద్ ఉన్ నబీ.. 6న గణేశ్ నిమజ్జనం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. గతేడాది 13,472 గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేశారని సీపీ తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గణేశ్ నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని సీపీ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మండపాల వద్ద జాగ్రత్తలు..
పీఓపీతో చేసిన విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలన్నారు. నాణ్యమైన విద్యుత్ వైర్లతో ప్రమాదాలకు తావు లేకుండా నిపుణులైన వారితో విద్యుత్ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. క్యూ లైన్లు.. పార్కింగ్ సదుపాయం కల్పించాలన్నారు. విగ్రహాలు చివరి రోజే కాకుండా 3, 5,7వ రోజులల్లో నిమజ్జనం జరిగేలా చూడాలన్నారు. ఇతర మతాలకు చెందిన కట్టడాలున్న చోట జెండాలు, పోస్టర్లు, బ్యానర్లు లేకుండా చూసుకోవాలని స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి సమస్యలు సృష్టించవద్దన్నా రు. డ్రోన్లు, ైప్లెయింగ్ కెమెరాలు నిషేధమని, బలవంతపు చందాలు వసూలు చేయవద్దన్నారు.