water and drainage problems | తాగునీటి, డ్రైనేజీ సమస్యలకు సత్వర పరిష్కారం : ఎమ్మెల్యే ముఠా గోపాల్
పూల్‌బాగ్‌లో తాగునీటి, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కవాడిగూడ : పూల్‌బాగ్‌లో తాగునీటి, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు గురువారం కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని పూల్‌బాగ్‌లో టీఆర్ఎస్ నగర యువజన విభాగం సీనియర్ నాయకుడు ముఠా జయసింహ, స్థానిక నాయకుడు కల్వగోపీలతో కలిసి పాదయాత్ర నిర్వహించి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా పూల్‌బాగ్‌లో తాగునీటి, డ్రైనేజీ సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎస్. యాదగిరి, పూల్‌బాగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డిడి ఉమేష్, మధు, రవి, పాస్‌పోర్ట్ శ్రీనివాస్, ప్రభాకర్, మహేష్, ఆనంద్, లక్ష్మయ్య, సుజాత, మైసమ్మ, దుర్గాబాయి, రమేష్, విఠల్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

