వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 3: నాణ్యత గల పూల మొక్కల నారుమళ్లు అందుబాటులో ఉన్నాయని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ పూల విభాగం హెడ్ డాక్టర్ జ్యోతి తెలిపారు. పూల పరిశోధన స్థానం పరిధిలో దాదాపు 8.5 ఎకరాల్లో నాణ్యత గల సీడ్ బంతి, చామంతి, మల్లె , లిల్లీ, గ్లాడియోలస్, కనకాంబరం, చైనా ఆస్టర్, తదితర నారుమళ్లతో పాటు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
అతి తక్కువ ధరలతో పాటు మినీకిట్లు ఇవ్వనున్నామని, పరిశోధనల మొక్కలను రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తక్కువ మోతాదులో ఎకరాకు పైగా నాటేందుకు ముందుగా సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. నగరం సమీపంలోని రంగారెడ్డి జిల్లాతో పాటు మహబూబ్నగర్, నల్గొండ, మెదక్ తదితర జిల్లాల రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని డాక్టర్ జ్యోతి తెలిపారు.