కొండాపూర్, జనవరి 29 : ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం ఆయన చందానగర్ డివిజన్లో ఉప కమిషనర్ సుధాంశ్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే ఎజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తూ ఎక్కడ ఎలాంటి సమస్యలున్నాయి.. కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని తెలసుకుంటున్నట్లు తెలిపారు. కాలనీలు, బస్తీల్లోని సమస్యలను వెంటనే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి, పీఏ నగర్, దీప్తిశ్రీనగర్, కేఎస్ఆర్ ఎన్క్లేవ్, శాంతినగర్ కాలనీల్లో డ్రైనేజీ, వీధి దీపాలు, లోఓల్టేజ్ సమస్యలతో పాటు పీఏ నగర్‌లోని వైకుంఠ ధామాల అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, జీహెచ్ఎంసీ ఈఈ శ్రీకాంతిని, డీఈ స్రవంతి, ఏఈ రమేశ్, జలమండలి జీఎం రాజశేఖర్, డీజీఎం నాగప్రియ, మేనేజర్లు సాయి చరిత, సునీత, ఏఎంఓహెచ్ కార్తిక్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ సంపత్, ఎలక్ట్రికల్ ఏఈ రాజ్‌కుమార్, ఎస్ఆర్పీ కనకరాజు, బాలాజీ, వర్క్ఇన్స్పెక్టర్ హరీశ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మినారాయణగౌడ్, నాయకులు జనార్దన్‌రెడ్డి, వెంకటేశ్, దాసరి గోపి, గుడ్ల ధనలక్ష్మి, పీవై రమేశ్, నాగరాజు, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
చందానగర్‌లో జ్వర సర్వేను పరిశీలించిన విప్ గాంధీ
కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం ఆయన చందానగర్ డివిజన్లోని కేఎస్ఆర్ ఎన్‌క్లేవ్‌లో కొనసాగుతున్న జ్వర సర్వేను కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, సర్కిల్ -21 డీఈ సుధాంశులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ డాక్టర్ కార్తీక్, జీహెచ్ఎంసీ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.