BC reservations | బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో బీసీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన
ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీసీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ: ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీసీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకాభిప్రాయంతో రాష్ట్రపతికి పంపించిన తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభల ఆమోదంతో కోర్టు వివాదాలకు అవకాశం లేకుండా, న్యాయ సమీక్షకు దూరంగా ఉండేందుకు తొమ్మిదవ షెడ్యూళ్లో చేర్చాలని కోరారు. ఈ డిమాండ్లతో బీసీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సైదులు యాదవ్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తొలగించాలనే బీజేపీ వైఖరిని తప్పుపట్టారు. 1971లో అనంతరామన్ కమిషన్ ఆధ్వర్యంలో ఆరు ముస్లిం ఉపకులాలను చేర్చిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే ఆ పార్టీని బీసీల ద్రోహిగా ప్రకటిస్తామన్నారు. చట్టసభల్లో 33 శాతం మహిళలకు కల్పిస్తున్న రిజర్వేషన్లలో బీసీ మహిళా కోటా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వీరబోయిన లింగంయాదవ్, బారీ అశోక్ కుమార్, కడారి రమేశ్, సురేష్, గణేష్, వెంబడి అభి, శంకర్, పైడి మహేష్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

