శేరిలింగంపల్లి : రోజురోజుకీ కనుమరుగవుతున్న మాతృభాషలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత అచార్యులు నడుపల్లె శ్రీరామరాజు అన్నారు. సోమవారం రాయదుర్గం ప్రభుత్వ పాఠశాలలో ఫ్రెండ్స్ వెల్పేర్ అసోసియేషన్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సాహిత్యం, సాంప్రదాయాలు, జానపదం మన మాతృభాషల్లో ఇమిడి ఉన్నాయన్నారు. ప్రపంచంలో వేలాది బాషలు ఉన్నాయని వాటిలో చిన్న చిన్న బాషలు అంతరించిపోతున్నాయన్నారు. అలాంటి కనుమరుగు అవుతున్న మాతృబాషలను కాపాడుకోవాలన్నారు.
ఫ్రెండ్స్ వెల్పేర్ అసోషిమేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, ఉపాద్యాయులు అంజనేయులు, ఆనందం, విద్యాకమిటీ ఛైర్మన్ కృష్ణగౌడ్, వైస్ ప్రెసిడెంట్ నరేందర్ ముదిరాజ్, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.