Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 6: ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్‌గా కె. శ్రీనివాస్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు.
సెంటర్ ఫర్ ప్లాంట్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీపీఎంబీ) లో ఆయన ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.